ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారే వారితో పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరు ఏ పార్టీలోకి వెళుతున్నారో.. ఎవరు వచ్చి తమ టికెట్‌కు ఎసరు పెడతారనోన్న ఆందోళన సిట్టింగుల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీలో చేరేందుకు నిర్ణయించారు. తాజాగా అనంతపురానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ పసుపు కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఆయన త్వరలోనే చంద్రబాబుతో భేటీ అయ్యి టీడీపీలో చేరతారని తెలిసింది. ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా, విప్‌గా పనిచేసిన అనుభవం ఉంది. శైలజానాథ్ టీడీపీలోకి వస్తే అనంతపురం జిల్లాలోని శింగనమల టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయంలో ఇరువర్గాల మధ్య చర్చలు నడుస్తున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం శింగనమల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున యామినిబాల సిట్టింగ్ ఎం.ఎల్.ఏగా ఉన్నారు. ఆమెకు ఈసారి టికెట్ దక్కకపోవచ్చన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆమె తల్లి శమంతకమణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం కల్పించారు. యామినిబాలకు టికెట్ ఇవ్వకుండా ఉండేందుకు శమంతకమణికి ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇచ్చారని సమాచారం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa