భారత్- పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ కు వెల్లాల్సిన విమానాలను చైనా రద్దు చేసింది. పాకిస్థాన్ నుంచి వచ్చే విమానాలను కూడా నిలిపివేయనున్నట్టు తెలిపింది. పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైనా అధికారులు తెలిపారు. మరోవైపు, పాకిస్థాన్ నిర్ణయంతో ప్రభావితమైన అంతర్జాతీయ ఎయిర్ లైన్లు తమ గగనతలాన్ని వినియోగించుకోవడానికి చైనా అనుమతించింది. ఇదే సమయంలో ఉద్రిక్త పరిస్థితులను స్వస్తి పలకాలని ఇండియా, పాకిస్థాన్ లకు చైనా సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa