మూడురోజుల క్రితం పాక్ బలగాల చేతుల్లో బందీ అయిన ఐఏఎఫ్ పైలట్ అభినందన వర్థమాన్ ఇవాళ స్వదేశంలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయనకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే వందలాది మంద్రి ప్రజలు డ్రమ్ములు వాయిస్తూ అభినందన్ ఫోటోలు, పూలదండలు, జాతీయ జెండాలతో అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. మరోవైపు పాకిస్తాన్ అధికారులు ఇప్పటికే వింగ్ కమాండర్ అభినందన్‌ను ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు అప్పగించారు. ఇవాళ మధ్యాహ్నం 3-4 గంటల మధ్య వాఘా సరిహద్దు వద్ద ఆయనను పాకిస్తాన్ భారత అధికారులకు అప్పగించనుంది.
ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచే ప్రజలు పెద్దఎత్తున ఇక్కడికి తరలిరావడం మొదలు పెట్టారు. అభినందన్ విడుదల వార్త తెలియగానే ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ‘‘మా దేశ వీరుడు తిరిగి వస్తున్నాడని తెలిసి ఇక్కడికి వచ్చాం. ఆయనకు మేమంతా ఘన స్వాగతం పలుకుతాం. యుద్ధంలోనూ, పాకిస్తాన్ చేతుల్లో బందీగా మారిన సమయంలోనూ ఆయన వీరోచిత సాహసం ప్రదర్శించారు….’’ అని అమృత్‌సర్‌కు చెందిన స్థానికుడు జితేందర్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa