ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలులో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్, పరీక్షల నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు. 91 పరీక్షా కేంద్రాల్లో 15, 194 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు.