సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లి వట్టి చేతులతో వచ్చారంటూ కొందరు వాగుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దావోస్ పర్యటన కంటే ముందే రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరులాగా ఏపీ చంద్రబాబే బ్రాండ్ అని పేర్కొన్నారు. అమరావతిలోని కట్టడాలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఐరన్నే వాడాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.