స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ఏటా జనవరిలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు 130 దేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వివిధ ప్రభుత్వాల ప్రతినిదులు హాజరవుతారు. భవిష్యత్తు అవకాశాలు, పెట్టుబడులు, అభివృద్ధి జరిగే వివిధ రంగాలపై చర్చలు జరుపుతారు. అయితే ఇదంతా నాణేనికి ఓవైపు.. కానీ, మరోవైపు సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలు శృంగార కోసం పరితపించిపోయి.. కోట్లు ఖర్చు చేశారట. యూకేకు చెందిన ప్రముఖ పత్రిక డెయిలీ మెయిల్ దీనిపై సంచలన నివేదిక వెలువరించింది. దావోస్ ఆర్దిక సదస్సు సందర్భంగా ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ భారీగా పెరిగిందని అందులో పేర్కొంది.
ఎస్కార్ట్‌లు, శృంగార పార్టీల కోసం పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో ఖర్చుచేసినట్టు తెలిపింది. స్విట్జర్లాండ్‌లో వేశ్య వృత్తి చట్టబద్దం. వీరిని ప్రత్యేకమైన ఏజెన్సీలు, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇటువంటి సర్వీసుల అందించే కంపెనీలు కూడా ఉంటాయి. వివిధ రకాల సర్వీసులను ఇవి అందజేస్తుంటాయి. శృంగార పార్టీలతో పాటు ఆసక్తి ఉన్నవారికి ట్రాన్స్ జెండర్లను కూడా సరఫరా చేస్తారు.
కానీ, పారిశ్రామికవేత్తలతో గడిపిన వారు మాత్రం వివరాలను బహిర్గతం చేయరాదనే ఒప్పందం చేసుకుంటారు. ఇందుకోసం వారికి పెద్ద మొత్తంలో నగదు ముట్టజెబుతారు. ఒక్కో బుకింగ్‌కు 6000 పౌండ్లు (రూ.6.5 లక్షలు) కూడా చెల్లించేవారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఈ ఈవెంట్‌ల సగటు బుకింగ్ వ్యవధి దాదాపు 4 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ ఏడాది ఆర్దిక సదస్సు జరిగిన మొదటి మూడు రోజుల్లో కేవలం ఒక్క వెబ్‌సైట్ నుంచే 270,000 పౌండ్లు (అంటే భారత కరెన్సీలో రూ2.9 కోట్లు) మేర శృంగార సర్వీసులను బుక్ చేసుకున్నట్టు డెయిలీ మెయిల్ నివేదిక తెలిపింది. వివిధ ప్రొవైడర్లలో మొత్తం బుకింగ్‌లు మన కరెన్సీలో రూ.10 కోట్లు ఉంటుందని అంచనా.
ఇక, శృంగార పార్టీలలో ఆర్గీస్ అనేది ప్రత్యేకం. ఒకేసారి పెద్ద సంఖ్యలో మహిళలను బుక్ చేసుకుని విచ్చలవిడిగా నచ్చినవారితో ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి పార్టీలకు వేశ్యలను అందించే టిట్‌ఫర్‌ట్యాట్ అనే కంపెనీ యజమాని డెయిలీ మెయిల్‌తో మాట్లాడుతూ.... మూడు రోజుల్లోనే 90 మంది కస్టమర్ల తమ యాప్ నుంచి 300 ఎస్కార్ట్‌లను బుక్ చేసుకున్నారని తెలిపారు. వీరిలో ట్రాన్స్ జండర్లు కూడా ఉన్నారని చెప్పారు. గతేడాది కేవలం 170 మంది మాత్రమే బుక్ చేసుకుంటే.. ఈ ఏడాది గణనీయంగా పెరిగిందని అన్నారు.
ఎస్కార్ట్ అవంత్‌గ్రేడ్ అనే కంపెనీ అధికార ప్రతినిధి సుసాన్ మాట్లాడుతూ.. ‘ఈ పార్టీలో తరుచుగా కోరుకునేది అనల్ సెక్స్ ఒకటి. ఈ రకమైన వ్యక్తులు తమను తాము అంటరానివారిగా భావిస్తారు.. వాస్తవికంగా వారు అలాగే ఉంటారు. ఎస్కార్ట్ మహిళలపై శారీరక దాడులు జరుగుతుంటాయి’ అని చెప్పారు. తమ తమ వ్యాపారాల్లో పగలు తీరికలేకుండా ఉండే పారిశ్రామికవేత్తలు రాత్రి అయ్యే సరికి అంత విలాస పురుషులుగా మారిపోతారని అంటున్నారు. అయితే, అందరూ అలాగే ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ దావోస్ ఆర్థిక సదస్సు సందర్భంగా శృంగార పార్టీల గురించి ప్రపంచం అంతా చర్చించుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa