మాడుగుల నియోజకవర్గ పరిధిలోగల చీడికాడ మండలం బైలపూడిలో బుధవారం శ్రీ మరిడిమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యేబండారు సత్యనారాయణమూర్తి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను మాజీ శాసన సభ్యులు గవిరెడ్డి రామానాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa