వాఘా: పాక్ చేతికి చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి భారత్‌కు వస్తోన్న నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) జాతీయ జెండా అవనతం, బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాలను రద్దు చేసింది. వాఘా-అటారి సరిహద్దులో రోజూ వీటిని నిర్వహిస్తారు. రోడ్డు మార్గంలో వాఘా సరిహద్దు వద్ద పాక్ అభినందన్‌ను అప్పగించనుండటంతో అడ్మినిస్ట్రేటివ్ కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని బీఎస్‌ఎఫ్ వెల్లడించింది. అభినందన్‌కు స్వాగతం పలకడానికి వాఘా సరిహద్దులో భారీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐఏఎఫ్ అధికారులు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa