ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ ఎన్నికల వేళ,, కేజ్రీవాల్‌కు హర్యానా సర్కారు షాక్!

national |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 10:25 PM

మరో వారం రోజుల్లోనే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలోనే ప్రధాన పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తోంది. ముఖ్యంగా ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం రోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఢిల్లీలోని బీజేపీతో పాటు కేంద్రంలో ఉన్న అధికారులపై కూడా కామెంట్లు చేశారు. ముఖ్యంగా హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ.. కావాలనే యమునా నదిలో పారిశ్రామిక విష పదార్థాలను కలుపుతుందని చెప్పారు. నదిలో విష వ్యర్థాలు కలిపి రాష్ట్ర ప్రజలను చంపే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.


అర్వింద్ కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. అన్ని రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు గట్టిగా స్పందిస్తున్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. లేదంటే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ కామెంట్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రధాని తాగే నీళ్లల్లో హర్యానా సర్కారు విషం కలుపుతుందా అంటూ గట్టిగా ప్రశ్నించారు. ఇలాంటి ఆసహ్యకరమైన ఆరోపణలు సరికావంటూ కేజ్రీవాల్‌కు సూచించారు.


అయితే తాజాగా హర్యానా సర్కారు సైతం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యమునా నదిని విషపూరితం చేస్తుందన్న వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆయనపై కేసు నమోదు చేయబోతున్నట్లు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ తెలిపారు. ఆప్ అధినేత చేసిన వ్యాఖ్యల వల్ల హర్యానాతో పాటు, ఢిల్లీ ప్రజలు తీవ్ర భయాందోళకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. ఆయన ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తుంటే తాము చూస్తూ కూర్చోమన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని.. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తామన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com