పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళను రెండువారాల్లో భారతదేశం విడిచి వెళ్లిపోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2005లో పాకిస్తాన్‌కు చెందిన 37ఏళ్ల మహిళ భారత్‌కు చెందిన వ్యక్తి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు వ్యతిరేకంగా భద్రతాపరమైన రిపోర్టులను పరిగణలోకి తీసుకున్న భారత ప్రభుత్వం.. ఆమెను దేశం విడిచి వెళ్లిపోవాలని నోటీసులు జారీ చేసింది. కానీ సదరు మహిళ ఆ నోటీసులను కొట్టేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ‘నేను పెళ్లయినప్పటి నుంచి భర్తతో కలిసి భారత్‌లోనే ఉంటున్నాను. 2015 నుంచి 2020 వరకు నాకు వీసా పర్మిట్ ఉంది’ అని వెల్లడించింది. అయితే మహిళ వేసిన పిటీషన్‌ను విచారించిన జస్టిస్ విభు బక్రు పిటీషన్‌ను కొట్టివేశారు. ‘సదరు మహిళకు వ్యతిరేకంగా భద్రతకు సంబంధించి పలు నివేధికలు వచ్చాయి’ అని అదనపు సొలిసిటర్ జనరల్ మహిందర్ ఆచార్య, కేంద్ర స్టాండింగ్ కమిటీ అధికారి అనురాగ్ అహ్లువాలియా వాదనలు వినిపించగా రిపోర్టులను కోర్టుకు చూపించి వాదించగా.. కోర్టు వారితో ఏకీభవించింది. ఆమె దేశం విడిచి వెళ్లిపోవాలని, అందుకు రెండు వారాల గడువు ఇస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ దేశం విడిచి వెళ్లకపోతే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, ఆమెకు భారత్‌లో ప్రవేశానికి జీవితకాల నిషేదం విధించే అవకాశం ఉన్నట్లు కోర్టు తీర్పును వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa