ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రకాల్పుల్లో నలుగురు జవాన్ల మృతి

international |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 08:49 PM

ఒకవైపు  పంజాబ్ సరిహద్దులో వాయుసేన పైలట్ అభినందన్ వర్ధమాన్ రాక కోసం వేచిచూస్తున్న భారతావని మరోవైపు కశ్మీర్‌లో నలుగురు జవాన్లను కోల్పోయింది. దీంతో కశ్మీర్ మరింత ఉద్రిక్తంగా మారింది. ఉగ్రవాదులు, పాక్ రేంజర్ల కాల్పులతో నెత్తురోడుతోంది. ఈ రోజు ఉదయం నుంచి జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని ఓ గ్రామంలోని ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులకు, భారత భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ సాగుతోంది. ఎన్‌కౌంటర్ సాయంత్రం మరింత భీకరంగా మారింది. కాల్పుల్లో చనిపోయినట్లు భావించిన ఒక ఉగ్రవాది.. ఇంటి శిథిలాల్లోంచి లేచొచ్చి కాల్పులు జరిపాడు. దీంతో ఒక సీఆర్పీఎఫ్ అధికారి, ఒక జవాను, ఇద్దరు పోలీసులు చనిపోయారు.  మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఎల్వోసీ వద్ద.. మూడు చోట్ల పాక్ జవాన్లు కాల్పులకు తెగబడుతున్నారు. సరిహద్దు జనావాసాలపై తూటాలు పేలుస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa