ప్రధాని మోదీ, ప్రతిపక్షనేత జగన్‌పై విరుచుకుపడ్డారు నటుడు శివాజీ. ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోదీ విశాఖకు రావడాన్ని నిరసిస్తూ నిరసన తెలిపాడు. అంతేకాదు మోదీ గోబ్యాక్ అంటూ శుక్రవారం రాత్రి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా తన అనుచరులతో నినాదాలు చేశాడు. రాష్ర్టాన్ని విడదీసి కాంగ్రెస్ తప్పు చేస్తే.. రైల్వేజోన్ ఇచ్చి బీజేపీ చేసిందేంటని దుయ్యబట్టాడు. రైల్వేజోన్ తమవల్లే వచ్చిందని చెబుతున్న వైసీపీ నేతలు, అందులో జరుగుతున్న మోసాన్ని ఎందుకు ఎండగట్టలేదని నిలదీశాడు.
మోదీ మీద రాష్ర్టమంతా వ్యతిరేకంగా వుంటే.. ఇవాళ జగన్ ఎక్కడున్నారని ప్రశ్నించాడు. గుంటూరు, విశాఖకు మోదీ వచ్చినప్పుడు నిరసన తెలియజేయలేని జగన్, నవరత్నాలతో ఏపీని ముందుకు తీసుకెళ్తారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించాడు. రాష్ర్టానికి ఇంత అన్యాయం చేసిన మోదీ వస్తే, కనీసం నిరసన తెలపరా? అంటూ విరుచుకుపడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa