దుష్టులకు ఒళ్లంతా కళ్లేనంటారు. ఉగ్రవాదుల దుష్టపన్నాగాలు సైతం ఒక్కోసారి అదేలా ఉంటాయి. చావు తప్పదని తెలిసినా...ఒక్కోసారి 'చావు' తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. కుప్వారా జిల్లా హంద్వారాలో అలాంటి ఘటనే శుక్రవారంనాడు చోటుచేసుకుంది. చనిపోయినట్టు నటించిన ఓ ఉగ్రవాది... భద్రతా బలగాలు దగ్గరకు రాగానే ఠక్కున లేచి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఒక పోలీసు మృతి చెందగా, ఐదుగురు సిబ్బంది గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa