ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎపిఎస్‌ఎస్‌డిసి), జర్మనీకి చెందిన యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్(ఈసీఎం) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు రొబోటిక్స్, మెకట్రానిక్స్ విభాగంలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం నాడు నైపుణ్యాభివృద్ధి సంస్థ, కార్మిక ఉపాధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ సమక్షంలో ఏపీఎస్ఎస్‌డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్‌కుమార్, ఈసీఎం మేనేజింగ్ డైరెక్టర్ టిల్ క్వార్డ్ ఫేగ్, 11 కాలేజీ యాజమాన్యాల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో అడ్వాన్స్ డ్ రొబోటిక్ కంట్రోల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఈ 11 ఇంజనీరింగ్ కాలేజీల్లో మెకట్రానిక్స్, రొబోటిక్స్ విభాగంలో అడ్వాన్సుడ్ అప్లైడ్ రొబోటిక్ కంట్రోల్ 1.0, అడ్వాన్సుడ్ అప్లైడ్ రొబోటిక్ కంట్రోల్ 2.0, అడ్వాన్సుడ్ అప్లైడ్ రొబోటిక్ కంట్రోల్ 3.0 కోర్పుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా జేస్వీ ప్రసాద్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీలు తమ ఫ్యాకల్టీలకు అంతర్జాతీయస్థాయి నైపుణ్యలతో శిక్షణ ఇచ్చినపుడే మంచి విద్యార్థులు తయారవుతారన్నారు. ఏపీఎస్ఎస్‌డిసి లాంటి సంస్థలతో పాటు ఇతర పరిశ్రమలతోనూ కాలేజీ యాజమాన్యాలు కలిసి పనిచేయాలన్నారు. అధ్యాపకులకు కూడా టెక్నాలజీపై అవగాహన ఉన్నపుడే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన వారిని అందించగలమని.. ఆదిశగా కాలేజీ యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని జేఎస్వీ ప్రసాద్ సూచించారు. మరోవైపు ఎపిఎస్‌ఎస్‌డిసి, ఈసీఎం ఆధ్వర్యంలో రెండోవిడత శిక్షణ కోసం 25 ఇంజనీరింగ్ కాలేజీలను ఎంపిక చేశారు. ఈ 25 కాలేజీలకు చెందిన మేనేజ్ మెంట్ బృందం ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 16వ తేదీవరకు జర్మనీలోని అకాన్ యూనిర్సిటీని సందర్శించారు. అక్కడ ఇండస్ట్రీ విజిట్‌లో భాగంగా ఆడి తయారీ యూనిట్‌తో పాటు ఐగూస్ రొబోటిక్స్ తయారీ ఫెసిలిటీ సెంటర్‌ను కూడా ఈ బృందం సందర్శించింది. రెండో విడత శిక్షణ మే నెలలో ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa