ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం మల్ల‌న్న‌కు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కళా వెంకట్రావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 10:35 PM

ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలం భ్ర‌మ‌రాంబ‌ మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వారికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితులు మంత్రోచ్ఛారణాల నడుమ  భ్ర‌మరాంభ మల్లిఖార్జున స్వామిని సతీసమేతంగా దర్శించుకుని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్బంగా మంత్రి కళాచ వెంకట్రావు అన్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ వి.శివరామిరెడ్డి, ఆలయ ఈవో రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. గత నెల 25 నుంచి ఈ నెల 7 వ‌రకూ 11 రోజుల పాటు జరుగుతున్న బ్రహ్మోత్సవాల సంద్భరంగా శ్రీశైల భ్ర‌మరాంభ మల్లిఖార్జున స్వామి దేవస్థానాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ నెల 4న మ‌హాశివరాత్రి ప‌ర్వ‌దినం సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa