ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భారతదేశం కోసం పోరాడిన హీరో అభినందన్ కోసం కోట్లాది మంది ప్రజలు సరిహద్దుల్లో ఎదురుచూస్తుంటే.. దేశభక్తి అంటూ గొప్పలు చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం రాజకీయాల ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నారు. భారత వైమానిక దళ పైలట్ అభినందన్‌కు వాఘా వద్ద స్వాగతం పలుకకుండా విశాఖలో నీచ రాజకీయాలు చేస్తూ జీరోగా మిగిలిపోయారు. రాఫెల్ డీల్‌పై పార్లమెంట్ వేదికగా కూడా మాట్లాడలేని మీకు అవినీతి గూర్చి మాట్లాడే అర్హత ఏమాత్రమూ లేదు. యూటర్న్ అనే పదానికి పేటెంట్ హక్కు మోదీదే. విభజన చట్టంలోని అన్ని అంశాలు నెరవేరుస్తామని, ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పిన మీరు తీసుకున్న టర్న్లను ఏమంటారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మోసపూరిత రైల్వేజోన్ ప్రకటనకు ఏం పేరు పెడతారు..? ప్రత్యేక హోదా విషయలో మీరు తీసుకున్న విధానాన్ని ఏమంటారు..? ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించుకోమని మాటల్లో చెప్పి, చేతల్లో మాత్రం కేవలం రూ.1500కోట్లు మాత్రమే ఇస్తే మీరన్న రాజధాని నిర్మాణం సాధ్యమేనా..? ఇది ద్రోహం కాదా..? పైగా రాష్ట్రానికి అన్ని చేశామని సుప్రీంకోర్టు సాక్షిగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం దేనికి సంకేతం..? అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం అంటే గాలి జనార్ధనరెడ్డి వంటి వారికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం, జగన్ వంటి ఆర్ధిక నేరస్తులతో చేతులు కలపడం, వారిపై ఉన్న కేసులు నత్తనడకన నడపడమా..? దీనికి ప్రధాని సమాధానం చెప్పగలరా..? ప్రధాని మోదీ చెప్పిన అన్ని పథకాలను కేంద్రం ఇచ్చిన దాని దానికంటే రెండింతలు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది. కనుక మీరు చెప్పే మాయమాటలను నమ్మి మోసపోవడానికి ఆంధ్రులు సిద్ధంగా లేరని గుర్తుంచుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa