ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రి 9.22 నిమిషాలకు అభినందన్ అప్పగింత

national |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 11:25 PM

భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్ధమాన్ అప్పగింతలో ఆలస్యం జరిగింది. అతడు కాసేపటి కిందటే వాఘా సరిహద్దుకు చేరుకుని భారత గడ్డపై కాలుమోపాడు. పాక్ వాహనాల కాన్వాయ్ అతణ్ని తీసుకొచ్చింది. ఇమిగ్రేషన్ ప్రక్రియ ఆలస్యం కావడంతో జాప్యం జరిగిందని పాక్ చెప్పింది. ఐసీఆర్‌సీ (రెడ్ క్రాస్) నిబంధనల ప్రకారం చీకటిపడ్డ తరువాతనే తప్పగించాలి కనుక అప్పగింత ఆలస్యమైందని అధికారులు తెలిపారు.  అభినందన్ వాఘా వద్ద పాక్ వైపు నుంచి నడుచుకుంటూ వచ్చి రాత్రి 9 గంటల 22 నిమిషాలకు భారత భూభాగంపై అడుగుపెట్టాడు. 


అంతకు అభినందన్ అప్పగింతపై అటు పాక్ ప్రభుత్వం, ఇటు భారత ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనేదీ విడుదల చేయకపోడంతో వాఘాలోని విలేకర్లు  చెప్పే వార్తలనే నమ్మాల్సి వచ్చింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అప్పగింత అంశాన్ని పర్యవేక్షించారు. అతణ్ని అమృత్ సర్ తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తర్వాత ఢిల్లీకి తీసుకొస్తారు. అప్పగింతకు ముందు పాక్ ఆర్మీ.. అభినందన్ స్టేట్ మెంట్ అంటూ ఒక ఎడిటెడ్ వీడియోను విడుదల చేసింది. పాక్ సైన్యం తనను బాగా చూసుకుందని అతడు చెప్పాడు. అయితే మాటలను అతికించినట్లు ఉంది. 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత భారత వాయుసే పాక్‌లోని ఉగ్రతండాలపై బాంబులు వేయడం, తర్వాత మన భూభాగంలోకి వచ్చిన పాక్ విమానాలను వెంటాడుతూ అభినందన్ శత్రుభూమిలోకి వెళ్లి పట్టుబడడం తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa