బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ సమావేశం సందర్బంగా బాపట్ల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శనివారం నూతన క్యాలెండర్ డైరీని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆవిష్కరించారు. బాపట్ల ప్రెస్ క్లబ్ కార్యాలయంనకు శాశ్వత భవనం నిర్మించుటకు సంపూర్ణంగా సహకరిస్తానని అంతేకాకుండా ఇప్పుడున్న కార్యాలయంనకు అద్దెను తాను పదవిలో ఉన్నంత వరకు చెల్లిస్తానన్నారు. కార్యాలయంకు కంప్యూటర్లను, ఏసీలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.