కర్నూలు అవుట్డోర్ స్టేడియం ఆధునీకరణకు జిల్లా ఒలంపిక్ సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. శనివారం ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు బి. రామాంజనేయులు మరియు ఇతర క్రీడా సంఘాల ప్రతినిధులు, షాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడును కలిసారు. వినతి పత్రంలో గ్రాస్ ఫుట్బాల్ కోర్టు, సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్, ప్రత్యేక వాకర్ ట్రాక్, క్రీడాకారుల వసతి భవనం, హాకీ టర్ఫ్ కోర్టు ఏర్పాటు అభ్యర్థించారు.