అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం ముద్దాలాపురం గ్రామానికి 50 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. తమ గ్రామానికి బస్సు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ బస్సుని స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. ముద్ధలాపురం నుండి రాయలప్పదొడ్డి హైస్కూల్‌కు ఇన్ని రోజులు బస్సు లేకపోవడంతో విద్యార్థులు 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. బస్సు సౌకర్యం రావడంతో విద్యార్థులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.