ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామన్న కేంద్ర ప్రభుత్వం... ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా సహకారం అందిస్తోంది. ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో పోలవరం అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్ కు రూ. 12,157.53 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు. అనుకున్న గడువులోగా పనులు పూర్తయ్యేలా సహకరిస్తామని చెప్పారు.2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కేంద్రంలో కూడా రాష్ట్ర కూటమి కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కూడా రూ. 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.