గతేడాది జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటి వరకు పార్టీని వీడి కూటమి పార్టీల్లోకి వెళ్తున్నారు కీలక నాయకులు. ఈ క్రమంలోనే ఇటీవల లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వైసీపీ కీలక పదవుల్లో ఎప్పట్నుంచో వైసీపీకి నమ్మకంగా పని చేస్తున్న నాయకులకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలో కూడా సమూల మార్పులకు జగన్ కసరత్తులు చేస్తున్నారని సమాచారం.