ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో విద్యార్థి ఆత్మహత్య..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2019, 11:12 AM

  విజ‌య‌వాడః  విజయవాడలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కానూరు వికాస్ మెడికల్ అకాడమీలో కార్తీక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. గుట్టుచప్పుడు కాకుండా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది వికాస్ మెడికల్ అకాడమీ యాజమాన్యం. అయితే, హాస్టల్ యాజమాన్యం వేధింపులు తాళలేక కార్తీక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు విద్యార్థి స్నేహితులు. కార్తీక్ స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa