కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైయస్ఆర్‌సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. తాజాగా తిరుపతిలో వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులకు ధ్వంసం చేసేందకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రి రోడ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నేతల అండతో అధికారులు ఓవరాక్షన్‌కు దిగారు.
వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి డీబీఆర్ రోడ్డులో నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనంలో మూడో అంతస్థులో కూల్చివేతకు మున్సిపల్ అధికారులు దిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలకు రావడంతో స్థానిక వైయస్ఆర్‌సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది.