ఎన్టీఆర్ జిల్లా,నందిగామ మండలం, చందాపురంలో విషాదం చోటు చేసుకుంది. చందాపురం, నల్లవాగు చప్తా రైలింగ్ వద్ద ఇద్దరు వ్యక్తులు కూర్చొని మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో వంతెనపై నుండి నీటిలో పడి మృతి చెందారు. మృతులు చందాపురంకు చెందిన సత్యం, జయరాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.