కేంద్ర బడ్జెట్ రాబోయే ఐదేళ్లకు రోడ్ మ్యాప్ లా పనిచేస్తుందని, ఆదాయ పన్ను పరిమితి రూ.12లక్షలకు పెంచడం వల్ల వారి కొనుగోలు శక్తి భారీగా పెరుగుతుందని, దీంతో ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని సీఐఐ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వి.మురళీకృష్ణ అన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్ దేశంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుందని సీఐఐ అభిప్రాయపడింది.అలానే .... కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం బాధాకరమని.. అమరావతికి నిధులు కేటాయించాలని ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ కోరింది. దేశంలో మొదటిసారిగా గ్రీన్‌ఫీల్డ్ సిటీ నిర్మాణం జరుగుతోందని, దీనికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సి ఉందని చాంబర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కరరావు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌కు నిధులు మరికొంత పెంచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.