కుటుంబంలోని అవ్వతాతలకు పెద్ద కొడుకులా చంద్రబాఋ నెలనెల ఫించన్లు అందింస్తుండంతో వారి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. పాములపాడు మండలంలోని క్రిష్ణానగర్, మద్దూరు గ్రామాలలో శనివారం టీడీపీ సీనియర్ నాయకుడు తిమ్మారెడ్డితో కలిసి ఇంటింటికి బైక్‌పై వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. ఎంపీడీవో చంద్రశేఖర్, టీడీపీ నాయకులు జనార్దన్‌రెడ్డి, బండ్లమూరి వెంకటేశ్వర్లు, గోవింద్, లక్ష్మీకాంతరెడ్డి, బాలస్వామి, కృష్ణారెడ్డి, నారాయణ, నరసింహులు, నసురుల్ల, అల్లీ, ఎస్.అలీ, సిద్ద, డాక్టర్ వెంకటస్వామి, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.