గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు తక్షణమే డ్యూటీ సర్టిఫికెట్ జారీ చేయాలని యూటీఎఫ్ కడప జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయకుమార్ మ హే్‌షబాబు డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ వీఆర్వో కా ర్యాలయంలో డీఆర్‌ఓ ఎం.విశ్వేశ్వరనాయుడికి వారు వినతిప త్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 మే మాసంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా ఉద్యో గ, ఉపాధ్యాయులు ఎన్నికల విధులు నిర్వహించారన్నారు. డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. డీఆర్‌ఓ స్పందిస్తూ ఎన్నికల విధు లు నిర్వహించిన ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.