ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి ప్రత్యేక హోదా ఎవరైతే ప్రకటిస్తారో వారికే మా మద్దతు : జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2019, 01:24 PM

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహిస్తున్న 'కాంక్లేవ్‌ 2019'లో ఆయన శనివారం మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఎవరైతే ప్రకటిస్తారో వారికే మా మద్దతు అని తెలిపారు. నా 9 ఏళ్ల రాజకీయ ప్రయాణం ప్రజల మధ్యే గడిచిందన్నారు. ఏ దారిలో నడుస్తున్నా.. ఎక్కడ ఉంటున్నా ఆ సమాచారమిచ్చాను.. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలుసుకున్నాని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్లో చాలా వరకు కొందరు వ్యక్తులు సృష్టించినవే అని పేర్కొన్నారు. రుణమాఫీ సాధ్యం కాదని తెలిసినా.. చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. అంతకు ముందున్న వడ్డీలేని రుణాలను చంద్రబాబు మాటల వల్ల రైతులు కోల్పోయారని, చంద్రబాబు పాలనలో ఎన్నో అవకతవకలున్నట్లు జగన్ ఆరోపించారు.


ఓ వర్గం వారికి చంద్రబాబు ప్రయోజనం కల్పించారు. మేం తీసుకొచ్చే గ్రామ సచివాలయాలతో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా నిర్ణయాలుంటాయి. నవ రత్నాలతో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఏపీలో విశ్వసనీయతకు- అవకాశవాదానికి మధ్య ఎన్నికలు.  మా నాన్న బతికి ఉన్నంత వరకు నా మీద కేసుల్లేవు. మా నాన్న చనిపోయిన తరువాత ఓదార్పు యాత్ర చేస్తానని ప్రకటించగానే కేసులు పెట్టారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి నా మీద కేసులు పెట్టించారు. మా నాన్న సంక్షేమ పాలన చూసిన తర్వాత భయపడ్డారు. కేంద్రంతో, రాష్ట్రంతో పోరాడితే కేసులు పెట్టడం చాలా సులభం. మా నాన్న చనిపోయిన తర్వాత నేను ప్రతిపక్షంలో ఉన్నా. అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టారు. నా మీద పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపిత తప్పుడు కేసులే అని జగన్ వ్యాఖ్యానించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa