ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అభినందన్‌’ అర్థం ఇప్పుడు మారిపోయింది

national |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2019, 02:23 PM

అభినందన్ అనే పదానికి ఇప్పుడు ఆ అర్థం మారిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శనివారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వాయు సేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ఏం చేస్తుందో ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని ఆయన అన్నారు. నిఘంటువులో ఉన్న అర్థాలకు భారత్‌ సరికొత్త అర్థాన్ని తీసుకురాగలదనే శక్తి ప్రపంచదేశాలు గుర్తించాయని మోదీ పేర్కొన్నారు. పాక్‌ అదుపులో ఉన్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విడుదలైన మరుసటి రోజు మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘భారత్‌ ఏం చేస్తుందో ప్రపంచం గమనిస్తోంది. డిక్షనరీలో ఉన్న పదాలకు అర్థాలను మార్చగలిగే శక్తి మన దేశానికి ఉంది. కంగ్రాట్స్‌ చెప్పే క్రమంలో అభినందన్‌ పదాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు అభినందన్‌ అర్థమే మారిపోయింది’ అని మోదీ పేర్కొన్నారు. పాక్‌ నుంచి వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ సురక్షితంగా భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన రాకను మోదీ స్వాగతిస్తూ ట్వీట్‌ చేశారు. ఆయన చూపిన అసమాన సాహసం దేశానికి గర్వకారణమంటూ కొనియాడారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa