అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తాజాగా తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో అభ్యర్థుల విషయమై నిశితంగా చర్చించి అనంతరం జాబితాను ప్రకటించారు. కాగా మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్‌ల వైపు చంద్రబాబు మొగ్గు చూపారు.
అభ్యర్థుల జాబితా ఇదే..
కాకినాడ ఎంపీ అభ్యర్థి: చలమలశెట్టి సునీల్,
కాకినాడ అర్బన్: వనమాడి కొండబాబు,
కాకినాడ రూరల్ : పిల్లి అనంతలక్ష్మీ,
పెద్దాపురం: చినరాజప్ప,
తుని : యనమల కృష్ణుడు,
జగ్గంపేట: జ్యోతుల నెహ్రు,
పత్తిపాడు : వరుపుల రాజా,
పిఠాపురం : పెండింగ్‌లో ఉంది.
కాగా ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీ తరఫున గెలుపొందారు.కాగా శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్న సునీల్‌కు కాకినాడ ఎంపీ సీటు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa