ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎఫ్‌ -16ల సమాచారమివ్వాల్సిందే

national |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2019, 07:47 PM

ఎఫ్ -16 విమానాలతో భారత్‌ సైనిక స్థావరాల పై దాడులు చేసినట్టు అన్ని ఆధారాలను భారత్‌ మీడియా ముందు పెట్టడంతో యుద్ధ విమానాలకు సంబంధించిన సమాచారమివ్వాలని పాకిస్థాన్ ఇవ్వాలని ఆమెరికా కోరింది. కేవలం ఎఫ్‌-16లను ఉగ్రవాద నియంత్రణ, ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తామని అమెరికాకు మాటిచ్చిన పాక్‌ ఈ మాట తప్పిన విషయం రుజువైంది. కేవలం ఎఫ్‌-16 విమానాలు మాత్రమే ప్రయోగించగల ఆమ్రామ్‌ క్షిపణి శకలాలను భారత సైనికాధికారులు మీడియా ముందు ఉంచిన సంగతి తెలిసిందే. ఒప్పందానికి విరుద్ధంగా విమానాలను పాక్‌ ఉపయోగించడంపై మొత్తం సమాచారాన్ని ఇవ్వాలని పాక్‌కు సూచించినట్టు అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. పాక్‌ ఎఫ్‌-16లను ఉపయోగించలేదని బుకాయిస్తుండటం గమనార్హం. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలపై ప్రయోగించే ఆమ్రామ్‌ క్షిపణులు కేవలం ఎఫ్‌-16లు మాత్రమే ఉపయోగించగలవు. భారత్‌పై దాడి చేసేందుకు వచ్చిన పాక్‌ ఎఫ్‌-16లను భారత మిగ్‌ విమానాలు అడ్డుకోవడంతో అవి వెనుదిరిగాయి. అయితే కొన్ని క్షిపణులును పాక్‌ ప్రయోగించింది. వీటి శకలాలు కశ్మీర్‌లోని రాజౌరి ప్రాంతంలో పడిపోగా వాటిని సేకరించిన భారత్‌ మీడియా ముందు ప్రదర్శించడంతో పాక్‌ దుర్నీతి ప్రపంచానికి వెల్లడయింది. గతంలో ఎఫ్‌-16ల అమ్మకాల విషయంలో అమెరికా చట్టసభ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే పాక్‌ అనుకూల లాబీయిస్టులు ఈ విమానాలను పాక్‌ ఉగ్రవాదంపై పోరుకు మాత్రమే వినియోగిస్తుందని హామీ ఇవ్వడంతో ఆ మేరకు ఒప్పందం చేసుకొని విక్రయించారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa