ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ హైకోర్టు స్లాబ్ కూలి నలుగురికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2019, 08:09 PM

అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఆంధప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. జనరేటర్‌కు సంబంధించిన ఆరు గదుల్లోని రెండు గదుల్లో స్లాబ్ కూలి నలుగురు కార్మికులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే తాడేపల్లి సమీపంలోని ఎన్‌ఆర్ఐకి ఆస్పత్రికి తరలించారు. వారిని జార్ఖండ్‌కు చెందిన వారిగా గుర్తించారు. అధికారులు అక్కడికి చేరుకుని.. స్లాబ్ ఎందుకు కూలిందో విచారణ జరుపుతున్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో లోపాలు ఉన్నట్లు తరచూ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa