కాశినాయన మండలంలోని రామచంద్రా పురం వద్ద సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ హనుమంతు వివరాల మేరకు.. ఒంగోలు జిల్లాలోని కంభం మార్కాపురంలో సిమెంట్ లోడు లారీ ప్రొద్దుటూరుకు వెళ్తూ పోరుమామిళ్ల- మైదుకూరు ప్రధాన రహదారిపై సోమవారం ప్రమాదానికి గురైందన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు (50) అక్కడికక్కడే మృతిచెందగా, క్లీనర్ ప్రాణాలతో బయట పడ్డాడని తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. కాగా ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో తారురోడ్డు పనులు జరుగుతున్నాయి. రోడ్డు ఎత్తు తగ్గులు ఉండడంతో లారీ పక్కకు ఒరిగి పడిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన కూతవేటు దూరంలోనే ఓ పెద్ద ట్రాన్స్‌ఫారం ఉంది. ఒకవేళ దాన్ని ఢీకొన్నట్లయితే పెనుప్రమాదం జరిగి ఉండేది.