ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడును టీడీపీ కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు మంగళవారం కలిశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో నిమ్మల రామానాయుడు కుప్పంలో ఉంటూ ఎన్నికలను పర్యవేక్షించారు. కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో టీడీపీ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.