ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళాగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ లో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ మంగళవారంనాడు పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్రస్నానం చేసి, గంగాహారతిలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంట హాజరయ్యారు.ఇండియా-భూటాన్ మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ భూటాన్ రాజు మహాకుంభ్‌కు హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరుదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు గంగాహారతి, పూజా కార్యక్రమాల్లో పొల్గొన్నారు. దీనికి ముందు సోమవారంనాడు మహాకుంభ్‌లో పాల్గొనేందుకు భూటాన్ రాజు ప్రయాగ్‌రాజ్ చేరుకోవడంతో ఆయనను చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆయన క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు వాంగ్‌చుక్‌కు స్వాగతం పలికారు.