AP: హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోనున్నారు. త్రివేండ్రంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని తొలుత దర్శించుకోనున్నారు.