ఇంటర్మీడియట్ విద్యార్థులకు బుధవారం నుంచి 20వ తేదీ వరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 83 వొకేషనల్ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు డీఐఈవో సయ్యద్ మౌల తెలిపారు. మూడు స్పెల్స్‌లో జరిగే ప్రాక్టికల్స్‌లో 12,311మంది ఒకేషనల్, బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. మొదటి సంవత్సరంలో 1908 మంది, రెండవ సంవత్సరంలో 2034 మంది ప్రాక్టికల్స్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
ఈనెల 9వ తేదీ వరకు 25 కళాశాలల్లో వొకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్, ఆపై 20వ తేదీ వరకు 58 కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పకడ్బందీగా నిర్వహించేందుకు గాను సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షల కన్వీనర్‌గా డీఐఈవో, స్పెషల్ అధికారిగా దయానందరాజు, డీఈసీ మెంబర్లుగా శరత్‌చ్చంద్ర, బాలసుబ్రమణ్యం, నిర్మల, వెంకటరమణారెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు. పరీక్షల సమయంలో ఇబ్బందులు ఉంటే 08572-293867 నంబరుకు తెలియజేయాలని చెప్పారు.