మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవల్‌పమెంట్ ఆఫ్ హార్టికల్చర్(ఎంఐడీహెచ్) పథకం కింద రాష్ట్రానికి మంజూరైన ప్రాజెక్టుల సంఖ్యను కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వివరించారు. పార్లమెంటులో టీడీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా స్పందించారు. ‘ఏపీలో 2023-24లో ఆమోదించిన మార్కెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సంఖ్య 608. 2024-25లో ఎంఐడీహెచ్ పథకం ఏపీలో మంజూరైన మార్కెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సంఖ్య 10,333. ఈ పథ కం కింద ఏపీలో మార్కెట్ మౌలిక సదుపాయాల కోసం చేసిన విడుదల చేసిన నిధులు... 2024-25 వరకు మొత్తం రూ.703.09 కోట్లు’ అని మంత్రి ఠాకూర్ తెలిపారు.