ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ

national |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2019, 10:52 AM

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీకి పెద్ద షాక్‌. బీజేపీ ఎంపీ సావిత్రి బాయి పూలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమె గతంలోనే కమలం పార్టీకి రాజీనామా చేశారు. కాషాయం పార్టీపై చాలా సార్లు బహిరంగ విమర్శలు కూడా చేశారు. ఆమెతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నేత రాకేశ్‌ కూడా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింధియా సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. గతేడాది బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా ఆమెకు సాన్నిహిత్యం ఉంది. 2000 సంవత్సరంలో బీజేపీలో చేరిన‌ పూలే 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఆమె 2014 సాధారణ ఎన్నికల్లో బహ్రైచ్‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa