మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ వైఎస్సార్‌సీపీ ఖండువా కప్పుకున్నారు. శుక్రవారం ఉదయం ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శైలజానాథ్ పార్టీలో చేరారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ.. శైలజానాధ్‌కు ఒక మిత్రుడిగా సలహా ఇస్తున్ననన్నారు. వైఎస్సార్‌సీపీలో విలువలు ఉండవని, అది దుర్మార్గమైన పార్టీ అని అన్నారు. పార్టీలో చేర్చుకునే ముందు ఎంతో ఆప్యాయంగా వుంటారని.. తరువాత జగన్ రెడ్డి రాజకీయ అత్యాచారం చేయిస్తారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీలో ఇప్పటికే 74 మంది ఇబ్బందులు పడ్డారని డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు.
దళితులకు వైఎస్సార్‌సీపీలో స్థానం లేదని.. మాదిగలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్సార్‌సీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. భ్యవిష్యత్తు బాగుండాలంటే శైలజనాద్ ఆ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఉంటే మంచిదని మాణిక్య వర ప్రసాద్ సలహా ఇచ్చారు.శింగనమల వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌గా శైలజానాథ్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ కొనసాగుతోంది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా శింగనమల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత టీడీపీ నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల మంత్రులుగా, ఎంఎల్ఏలుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019 లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా సాధించుకోలేకపోయారు.
![]() |
![]() |