స్నేహం పేరుతో ఓ యువకుడు అమ్మాయికి దగ్గరయ్యాడు. మాయమాటలు చెబుతూ కొద్దికొద్దిగా నమ్మించసాగాడు. అదును చూసిన ఆ యువతిని అత్యాచారం చేసి ఆ పై నగ్నంగా ఫొటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ఈ దారుణమైన సంఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పరిధిలో చోటుచేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ యువతి సమీపంలోని పరిటాలలో తోటి విద్యార్థినులతో కలిసి ఉంటుంది. పరిటాల గ్రామానికి చెందిన గాలి సైదా అనే యువకుడితో స్నేహం ఏర్పడింది. కొద్ది రోజులుకు వీరిద్దరూ మరింత దగ్గరయ్యారు. స్నేహాన్ని ఆసరాగా తీసుకున్న సైదా విద్యార్థినికి మాయమాటలు చెప్పి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో విద్యార్థినిని నగ్నంగా ఫొటోలు కూడా తీశాడు.
విద్యార్థిని నగ్న ఫొటోలు తన వద్ద పెట్టుకున్న సైదా తనను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ ఫొటోలను తన ఫ్రెండ్స్‌కి కూడా చూయించడంతో వారు కూడా విద్యార్థినిని బ్లాక్‌మెయిల్ చేశారు. వేధింపులు భరించలేని యువత పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
![]() |
![]() |