విద్యా సంవత్సరం ఆఖరుకు రాగానే విద్యార్థుల్లో ఎక్కడ లేని భయం, ఆందోళన నెలకొంటాయి. ఏడాది మొత్తం బాగానే చదివినా పరీక్షలు అంటే మాత్రం హడలిపోతారు స్టూడెంట్స్. చదివింది గుర్తుపెట్టుకోవడం, బాగా రాయడంలో తడబడుతుంటారు విద్యార్థులు. అందుకే వారిలో మనోధైర్యం నింపేందుకు, భయాన్ని పోగొట్టేందుకు ప్రతి ఏటా ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తన జీవిత అనుభవాలను వారితో పంచుకుంటూ ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవడం, భయాన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఏడాది కూడా పరీక్షా పే చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చదువుతో పాటు ఆటపాటలు కూడా ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. మనం రోబోలం కాదని.. మనుషులమని చెప్పారు. క్రీడల ద్వారా రోజంతా పడిన శ్రమ, ఒత్తిడి అంతా పోయి ఉపశమనం లభిస్తుందన్నారు. విద్యార్ధులకు రిలాక్సేషన్ అవసరమని తెలిపారు. స్టూడెంట్స్ రోబోలు కాదని.. వాళ్లను ఒకే చోట బంధించి పుస్తకాల పురుగుగా మార్చేయడం సరికాదన్నారు మోడీ. వాళ్లకంటూ కొన్ని ఇష్టాఇష్టాలు ఉంటాయని.. అవి చేసే స్వేచ్ఛ ఇస్తే చదువులోనూ ముందంజలో ఉంటారని సూచించారు ప్రధాని. పరీక్షలే జీవితం అనుకోవద్దని.. ఇలాంటి ఆలోచన కరెక్ట్ కాదన్నారు మోడీ. స్టూడెంట్స్ ఎగ్జామ్స్, స్కూల్ పాఠాల దగ్గరే ఆగిపోవద్దని.. జ్ఞానాన్ని పెంచుకోవడం మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. జ్ఞానం ఎంత పెంచుకున్నా తక్కువేనన్నారు. అలాగని పరీక్షలు-జ్ఞానానికి మధ్య లింక్ పెట్టడం సరికాదన్నారు మోడీ.
![]() |
![]() |