AP: నులి పురుగుల నివారణకు రాష్ట్రప్రభుత్వం ఇవాళ 1-19 ఏళ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రలు అందజేయనుంది. అయితే నులి పురుగులు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసా? నులి పురుగులు అనేవి పేగుల్లోని పోషకాలతో అభివృద్ధి చెందే పరాన్నజీవులు. వీటితో అస్కారియాసిస్ అనే వ్యాధి వస్తుంది. చిన్నారుల్లో కడుపు నొప్పి, రక్తహీనత, పోషకాహార లోపం, విరోచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కలుషితమైన ఆహారం వల్ల నులి పురుగులు అభివృద్ధి చెందుతాయి.
![]() |
![]() |