డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఐదవ తరగతి విద్యార్థుల ఇంగ్లీష్ మీడియం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకులానికి సంబంధించిన నిర్వాహకులు తెలియజేశారు. ప్రత్యేక వెబ్ సైట్ లాగిన్ తో పాటు రెండు ఫోన్ నెంబర్లు అదేవిధంగా నేరుగా ఆ గురుకులానికే వచ్చి ప్రవేశ దరఖాస్తులు అందించవచ్చు అంటూ పేర్కొన్నారు. దాదాపు నెల రోజులు ఈ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఇంతకీ ఎక్కడుంది గురుకులం..ఆ విశేషాలు ఒకసారి చూద్దాం.
కాకినాడ జిల్లాకు సంబంధించి అన్నవరం తుని సమీపానగల లోవకొత్తూరు గ్రామంలో గల సాంఘిక సంక్షేమ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఐదవ తరగతి బాలురకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అయితే నేటి నుంచి మార్చి 6వ తేదీ వరకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పట్టణ, రూరల్ ప్రాంతానికి చెందిన వారు ముఖ్యంగా అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
![]() |
![]() |