రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు, ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం రూ.12 వేల కోట్లు, నష్టాలలో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు రూ.11,440 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. సోమవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో టీడీపీ తరఫున ఎంపీ లావు మాట్లాడారు. ‘రాష్ట్రాభివృద్ధికి కేంద్ర బడ్జెట్ మరింత ఊతం ఇస్తుంది. వికసిత్ భారత్ 2047కు లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్థికి కేంద్రం సహకరించాలి’ అని కోరారు.
![]() |
![]() |