ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్నాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగంపై చర్చను చేపడతారు. ఈ సమావేశాలను సుమారు 20 పని దినాలు నిర్వహించాలని భావిస్తున్నారు.
అయితే బీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధుల అర్థవంతమైన భాగస్వామ్యం ఉండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 22, 23న శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు, శిక్షణ తరగతులకు సమాయత్తంగా మంగళవారం చీఫ్ విప్, విప్‌లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ఉభయసభలకు చెందిన ఇద్దరు చీఫ్ విప్‌లతోపాటు 18మంది విప్‌లు హాజరవుతారు.
![]() |
![]() |