అనంతపురం నగరపాలక సంస్థ పరిధి లో చేసిన పనులకు బిల్లులు రాలేదని, రూ.3కోట్ల బిల్లుల పరిస్థితి సందిగ్ధం లో ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు కాంట్రాక్టర్లు తెలిపారు. కార్పొ రేషన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, నగర కమిషనర్ బాలస్వామి వినతులు స్వీకరించారు. కాంట్రాక్టర్లు వేణుగోపాల్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులు ఎమ్మెల్యేని కలిసి విన్నవించారు.
15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి అన్ని మున్సిపల్ ఖాతాలలో డబ్బులుండేవని, ఆ డబ్బు అంతా వెనక్కు పంపాలని గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఆదేశాలందాయన్నారు. అన్ని మున్సిపాలిటీలలో బిల్లులు క్లియర్ చేసి పంపారని, అనంతపురం నగరపాలక సంస్థలో 18బిల్లులకు సంబంధించి రూ.3కోట్ల వర కు బిల్లులు క్లియర్ చేయకుండా మొత్తం రూ.12కోట్లు వెనక్కు పంపారని వారు పేర్కొన్నారు. ఏడాదిన్నరగా బిల్లుల సమస్య ఉందని, త్వరగా పరిష్కరించాలని వారు ఎమ్మెల్యేని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అధికారులకి దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు.
![]() |
![]() |