ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు-ఎల్లుండు పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2019, 01:22 PM

 ఆంధ్రప్రదేశ్‌ లో రేపు, ఎల్లుండి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. బుధ, గురువారాల్లో ఎండ తీవ్రత పెరగడంతో పాటు బలమైన వడగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ విషయమై వాతావరణ శాఖ అధికారి మాట్లాడుతూ.. ఈ రోజు ఎపి లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2-3 డిగ్రీల సెల్సియస్‌ పెరిగిందని వెల్లడించారు. రేపు (బుధవారం) ముఖ్యంగా రాయలసీమలో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించారు. ఎల్లుండి (గురువారం) ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తీవ్రమై వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుందని తెలిపారు. మరో వైపు.. రాబోయే నాలుగు రోజుల్లో ఎపి లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. పగటిపూట బయటకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, వడదెబ్బకు గురికాకుండా విరివిగా పానీయాలను సేవించాలని వాతావరణ అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa