శ్రీకాకుళం : జలుమూరు మండలంలోని శ్రీ ముఖలింగేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ నివాస్ మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 4 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు శ్రీముఖలింగంలో నిర్వహించనున్న ఉత్సవ ఏర్పాట్లను కలెక్టర్ నివాస్ పరిశీలించారు. ఈ నెల 7 వ తేదీన నిర్వహించనున్న శ్రీ ముఖలింగేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాల రేవును, వంశధార నదిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు అందజేశారు. నదిలో బారికేడ్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa